Saturday, April 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్“మన ఇసుక –  వాహనం” ఆన్లైన్ విధానం అమలు

“మన ఇసుక –  వాహనం” ఆన్లైన్ విధానం అమలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
స్థానిక గృహ నిర్మాణదారులు,  ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన ఇసుకను సరఫరా చేయుటకు ప్రభుత్వం “మన ఇసుక –  వాహనం” ఆన్లైన్ విధానాన్ని అమలు పరచినదని బాన్సువాడ ఆర్టిఓ కిరణ్మయి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సందర్భంగా ఆర్డీవో కిరణ్మయి మాట్లాడుతూ ఈ విధానంలో భాగంగా, ఇసుక అవసరమున్న వినియోగదారులు తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది అన్నారు . ఇందుకోసం ప్రభుత్వం అందుబాటులో ఉంచిన పోర్టల్: http://tgmiv.cgg.gov.in దరఖాస్తు ప్రక్రియలో, వినియోగదారులు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి సూచించారు.

సంబంధిత పంచాయతీ సెక్రటరీ  దరఖాస్తును పరిశీలించి తహసీల్దార్ కి పంపిస్తారు అని అన్నారు. తహసీల్దార్ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అనుమతి మంజూరు చేస్తారు తెలిపారు .అనుమతి వచ్చిన తరువాత దరఖాస్తుదారుడు ఆన్లైన్‌లో చెల్లింపు (పేమెంట్) చేయాలి అని పేర్కొన్నారు. అనంతరం, అనుమతి పొందిన ఇసుక అమ్మకం జరిగే ప్రాంతం నకు  ట్రాక్టర్‌తో వెళ్లి, సంబంధిత  అధికారికి తనకు వచ్చిన యు ఆర్ ( QR) కోడ్‌ను చూపించి ఇసుకను నింపు కొని వెళ్లవచ్చు. ప్రభుత్వ అవసరాల కోసం ఇసుక ను సంబంధిత ప్రభుత్వ ఇంజనీరింగ్ అధికారి దరఖాస్తును ఆన్లైన్ లో చేయవలసి ఉంటది అని సూచించారు . ధరల వివరాలు ఈ క్రింద తెలుపనైనది.

ఇందిరమ్మ ఇల్లు – రూ.14.2. స్థానిక గృహ నిర్మాణదారులు -రూ. 900. ప్రభుత్వ పనులు- రూ. 660. చెల్లించవలసి ఉంటది. ఒక వేల ఏదైనా కారణం చేత ఇసుక సరఫరా కాకపోతే ఇసుక రీచును మార్చుకొనే వెసులుబాటు కూడా ఉన్నది అన్నారు. ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు పరచడం ద్వారా ఇసుక సరఫరాలో పారదర్శకత, సమర్థత మరియు సామాన్య ప్రజలకు సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నదని సూచించారు.

అందువల్ల, ఇకపై ఇసుక అవసరమున్న వినియోగదారులు తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసి, సంబంధిత అనుమతులు పొందిన తరువాత మాత్రమే ఇసుకను పొందవలసిందిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ శాంగ్వాన్ ఆదేశాల మేరకు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -