Wednesday, April 8, 2026
E-PAPER
Homeసినిమా500 థియేటర్లలో..

500 థియేటర్లలో..

- Advertisement -

ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా, విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు.
ఈ చిత్రంలో ఎస్‌.జె.సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్‌, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. శ్రీ పద్మిని సినిమాస్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఈనెల 10న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్‌ శివప్రసాద్‌ మీడియాతో ముచ్చటించారు.
మొదట శ్రీరామ్‌తో ‘మాత’ సినిమా నిర్మించాం. తర్వాత ‘రారాజా’ ప్రొడ్యూస్‌ చేశాం. సుహాసిని మణిరత్నంతో ‘మహతి’ అనే సినిమా చేస్తున్నాం. ఆ సినిమా షూటింగ్‌లో ఇంకా 10% బ్యాలెన్స్‌ ఉంది. అలాగే విజరు సేతుపతి ‘ఏస్‌’ సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేశాం. మరాఠీలో ఒక సినిమా తీశాం. అది రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఆ సినిమాకు డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ నేనే. ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం. గీతాంజలి, మిథున్‌ చక్రవర్తి డిస్కో డాన్సర్‌ రీ-రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అలాగే మా తమ్ముడిని పరిచయం చేస్తూ ‘రంగూన్‌ రాజా’ అనే సినిమా చేశాం. ఆ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉంది. జూలైలో రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నాం.
‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ సినిమా కోసం చాలా మంది ప్రయత్నించారు. కానీ మేమే ముందుగా కమిట్‌ కావడంతో, మాకు ఇచ్చారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా మంచి సక్సెస్‌ అవుతుందని నమ్మకం ఉంది. దాదాపు 500 స్క్రీన్స్‌లో రిలీజ్‌ కానుంది. డిస్ట్రిబ్యూషన్‌ పరంగా మేము సేఫ్‌గా ఉన్నాం.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఫ్యూచర్‌ టెక్నాలజీ ఆధారంగా చేసుకుని డిజైన్‌ చేసిన స్టోరీ ఇది. టెక్నాలజీ హ్యూమన్‌ రిలేషన్స్‌, ఎమోషన్స్‌పై ప్రభావం చూపితే ఎలా ఉంటుందనే విషయం ఈ సినిమాలో ప్రధానంగా ఉంటుంది. టెక్నాలజీ కారణంగా మనుషుల మధ్య సంబంధాలు హార్ట్‌ఫుల్‌గా కాకుండా ఆర్టిఫిషియల్‌గా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రదీప్‌ రంగనాథన్‌, విఘ్నేష్‌ శివన్‌, అనిరుధ్‌ రవిచందర్‌ .. వీరి పనితనం ఈ చిత్రానికి హైలైట్స్‌.
ఎస్‌.జే.సూర్య పాత్ర అద్భుతంగా వచ్చింది. ఆయన ఒక హీరోలా చేశారు. ప్రదీప్‌, సూర్య ఇద్దరూ మంచి పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. దిల్‌ రాజు, అనిల్‌ రావిపూడి ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి వచ్చి మాకు ఎంతో సపోర్ట్‌ చేశారు. కంటెంట్‌ కూడా కచ్చితంగా ఆడియన్స్‌లోకి వెళ్తుంది. ఇది ఫుల్‌-లెంగ్త్‌ ఎంటర్టైనర్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -