Tuesday, December 30, 2025
E-PAPER
Homeక్రైమ్భూ తగాదాల్లో అన్న చేతిలో తమ్ముడు హతం

భూ తగాదాల్లో అన్న చేతిలో తమ్ముడు హతం

- Advertisement -

నవతెలంగాణ-పాపన్నపేట
భూ తగాదాల్లో అన్న చేతిలో తమ్ముడు హతమైన ఘటన మెదక్‌ జిల్లా పాపన్నపేట మండల పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం..మండల పరిధిలోని బాచారం గ్రామానికి చెందిన చాకలి ఆశయ్య, దశరథ (36) సాయిబాబాలు ముగ్గురు అన్నదమ్ములు. కాగా గత కొంత కాలం క్రితం దశరథ తన అన్న ఆశయ్య వద్ద కొంత భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయాలని దశరథ కోరుతున్నప్పటికీ ఆశయ్య దాటవేస్తూ జాప్యం చేస్తున్నాడు. కాగా సోమవారం రాత్రి దశరథ తన అన్న ఆశయ్యకు పోన్‌ చేసి భూమి తన పేర రిజిస్ట్రేషన్‌ చేయాలని కోరాడు. దీంతో తమ్ముడిపై కోపం పెంచుకున్న ఆశయ్య కత్తితో గ్రామ చౌరస్తా వద్దకు వచ్చాడు. అక్కడ ఉన్న దశరథను కత్తితో దశరథను పొడి దాడి చేశాడు. దీంతో కడుపు భాగంలో , ఇతర శరీర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన దశరథ కుమారుడు సంగమేశ్వర్‌ కు సైతం గాయాలయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలతో ఉన్న దశరథ, అతని కుమారుడు సంగమేశ్వర్‌ను మెదక్‌ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు దశరథను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. సంగమేశ్వర్‌ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ విషయమై ఎస్‌ఐ శ్రీనివాస్‌ గౌడ్‌ను వివరణ కోరగా ఘటన జరిగింది వాస్తవమేనని ఇంకా ఫిర్యాదు అందలేదని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -