- Advertisement -
అశ్వారావుపేటకు మరో 195 ఇండ్లు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
రాష్ట్ర ప్రత్యేక కోటా లో ఏజెన్సీలో విభాగంలో అశ్వారావుపేట నియోజక వర్గానికి మరో వేయి ఇందిరమ్మ ఇండ్లు అదనంగా మంజూరు అయ్యాయి. ఇందులో అశ్వారావుపేట మండలానికి అదనంగా 195 ఇండ్లు రానున్నాయి. లబ్ధిదారుల ఎంపిక,అర్హతలు ఖరారు విషయం అయి శుక్రవారం ఎంపీడీఓ బి.అప్పారావు తో ఐటీడీఏ ప్రత్యేక అధికారి ఉదయ్ బాబు,హౌసింగ్ ఏఈఈ మదన్ మోహన్ లు సమావేశం అయ్యారు. మొదటి దఫా ఇందిరమ్మ ఇండ్లు మంజూరి కి ఏం అర్హతలున్నా యో అవే నిబంధనలు వర్తిస్తాయని,ప్రత్యేకంగా గిరిజనులకు మాత్రమే అర్హత ఉంటుందని వారు తెలిపారు.
- Advertisement -