పోలీస్ శాఖలో 15 మందికి పతకాలు
హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డికి గ్యాలంటరీ అవార్డు
ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా, 12 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్
ఫైర్, జైళ్లు, హోంగార్డ్ విభాగంలో మరో 8 అవార్డులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
77వ గతణంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ ప్రకటించిన మెడల్స్‌లో తెలంగాణకు 23 పతకాలు వరించాయి. పోలీస్ శాఖలో ఉత్తమ సేవలకు గాను 15 మంది పోలీసులకు మెడల్స్ దక్కాయి. ఒకరికి గ్యాలంట్రీ మెడల్ (జీఎం), ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా మెడల్ (పీఎస్ ఎం), మరో 12 మందికి పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్(ఎంఎస్‌ఎం) అవార్డులు దక్కాయి. హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైన గ్యాలంట్రీ మెడల్ దక్కింది. ఏఎస్పీ మంద జీ ఎస్ ప్రకాశ్‌రావు, ఎస్‌ఐ అన్ను దామోదర్ రెడ్డిలకు రాష్ట్రపతి విశిష్ట సేవా మెడల్(పీఎస్‌ఎం)లు వరించాయి.
అలాగే ఐజీ బీ. సుమతీతో పాటు కమాండెంట్ పీవీ రాములు, డీఎస్పీ ఎం. శంకర్, సీనియర్ కమాండెంట్ ఏ భాను మూర్తి, డీసీపీలు కెవిఎం ప్రసాద్, సి. వంశీ మోహన్ రెడ్డి, తుమ్మల లక్ష్మీ, ఎస్‌ఐలు బుర్ర యెల్లయ్య, వి. పురుషోత్తం రెడ్డి, ఎస్ అబ్దుల్ కరీం, ఏఎస్‌ఐ బొడ్డు ఆనందం, హెడ్ కానిస్టేబుల్ పైలి మనోహర్‌లకు ఎంఎస్‌ఎం అవార్డులను కేంద్ర ప్రకటించింది. కాగా, దేశ వ్యాప్తంగా 982 మంది పోలీస్, ఫైర్, హోంగార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్, జైళ్ల శాఖకు సేవా పతకాలను కేంద్రం ప్రకటించింది. ఇందులో 125 మందికి గ్యాలంట్రీ, 101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా మెడల్స్, 756 మందికి మెరిటోయస్ సర్వీస్ మెడల్స్ ఉన్నాయి.
జైళ్లు, అగ్ని, హోంగార్డు విభాగంలో మరో 8 అవార్డులు
కేంద్రం ప్రకటించిన మెడల్స్‌లో తెలంగాణకు చెందిన అగ్నిమాపక శాఖలో మూడు, హోంగార్డ్ విభాగంలో మూడు, జైళ్ల శాఖలో మరో ఇద్దరికి మెరిటోయస్ సర్వీస్ మెడల్స్(ఎంఎస్‌ఎం) వరించాయి. ఫైర్ సర్వీస్‌లో లీడింగ్ ఫైర్ ఫైటర్స్ సింగ్ ఘవెరీ రాజేందర్, హనుమంతా రావు గౌతి, రవీందర్ కొలపురీలకు కేంద్రం పథకాలను ప్రకటించింది. జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ ఎం సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ జైలర్ అశోక్ కుమార్‌కు, హోం గార్డ్స్ విభాగంలో రవి మసరామ్, పి జంగయ్య, బుర్రనొళ్ల రేణుకకు ఈ అవార్డులు దక్కాయి.
గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో తెలంగాణకు 23 మెడల్స్
- Advertisement -
- Advertisement -



