Tuesday, February 24, 2026
E-PAPER
Homeసినిమారాజమౌళి సినిమాలో..

రాజమౌళి సినిమాలో..

- Advertisement -

శ్రీ విష్ణు, నయన్‌ సారిక జంటగా ‘విష్ణు విన్యాసం’తో అలరించబోతున్నారు. యదునాథ్‌ మారుతీ రావు దర్శకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుమంత్‌ నాయుడు జి నిర్మించారు. ఈనెల 27న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్‌ నయన్‌ సారిక మీడియాతో ముచ్చటించారు.
ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్‌ ఉంటుంది. నా క్యారెక్టర్‌కి చాలా షేడ్స్‌ ఉంటాయి. కొంచెం ఫీమేల్‌ డామి నేటింగ్‌గా ఉంటుంది. ఫస్ట్‌ ఆఫ్‌లో అబ్బాయిలకి కాస్త చిరాకు కలిగిస్తుంది. కానీ దానికి కారణం ఏమిటో సెకండ్‌ హాఫ్‌లో రివీల్‌ అయిన తర్వాత ఆ క్యారెక్టర్‌ని అందరూ అర్థం చేసుకొని, ఇష్టపడతారు.
టీజర్‌లో నా క్యారెక్టర్‌ కాస్త బోల్డ్‌గా కనిపించింది. టీజర్‌లో చూసిన కొన్ని సీన్స్‌ క్యారెక్టర్‌ కోసం, కథ కోసం చాలా ఇంపార్టెంట్‌. ఇందులో మనీషా అనే క్యారెక్టర్‌లో కనిపిస్తాను. తను జీవితంలో చాలా బాధలు ఎదుర్కొన్న అమ్మాయి. ఒక పాయింట్‌ వచ్చిన తర్వాత జీవితాన్ని హాయిగా బతకాలనుకునే అమ్మాయి. నేను కాలేజీలో ఫ్యాకల్టీగా కనిపిస్తాను. విష్ణు క్యారెక్టర్‌ కూడా అదే. ఇద్దరు లెక్చరర్స్‌ మధ్య జరిగే ప్రేమ కథ. స్టూడెంట్స్‌, యూత్‌ చాలా బాగా కనెక్ట్‌ అవుతారు.
‘గంగం గణేశా, ఆరు, క’ లాంటి వరుస విజయాలు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా కూడా నాకు మరింత మంచి పేరు తీసుకొస్తుంది.
శ్రీ విష్ణుతో పనిచేయడం వెరీ ఫన్‌ జర్నీ. డైరెక్టర్‌ మారుతి చాలా టాలెంటెడ్‌. నిర్మాతలు చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు. ప్రతి విషయంలో సపోర్ట్‌ చేశారు. రధన్‌ అద్భుతమైన పాటలు ఇచ్చారు. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా చాలా బాగుంటుంది.
నాకు రాజమౌళి సినిమాలో పనిచేయాలని ఉంది. అదే నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. ప్రస్తుతం ‘రాకాస’ సినిమా చేస్తున్నాను. అది ఫాంటసీ కామెడీ. అలాగే ‘గోల్డెన్‌ స్టార్‌ గణేష్‌’తో ఒక కన్నడ సినిమా చేస్తున్నాను. నేను ఏ పాత్ర చేసినా అది కచ్చితంగా భిన్నంగా ఉండాలని ఆశిస్తాను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -