Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి

ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి

- Advertisement -

నవతెలంగాణ – మునిపల్లి
ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష ను నిర్వహించాలనే ఆలోచనను విరమించుకోవాలని టీఎస్ యుటిఎఫ్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వారగంటి అనురాధ డిమాండ్ చేశారు. టీఎస్ యుటిఎఫ్ మునిపల్లి మహాసభలకు హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23న సవరించాలని టెట్ పరీక్ష సిలబస్ లో మార్పులు చేపట్టాలని ఆమె కోరారు. విద్యారంగంలో పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అనురాధ డిమాండ్ చేశారు. పెండింగులో ఉన్న పిఆర్సి మరియు కరువుభత్యాన్ని వెంటనే మంజూరు చేయాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో మునిపల్లి మండల టీఎస్ యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మునేష్, నిరూపరాణి నాయకులు ఆనంద్, అశోక్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -