ఆర్‌యూపీపీటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు నివ్వాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ (ఆర్ యుపీపీటీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవేళ టెట్ తప్పనిసరైతే భాషోపాధ్యాయులకు ప్రత్యేకంగా పేపర్ 3 నిర్వహించాలని కోరారు. జి.ఓ 317 ద్వారా నష్టపోయిన భాషోపాధ్యాయులకు అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. రాష్ట్రగీత రచయిత ప్రముఖ కవి అందెశ్రీకి శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించారు. ఈ సమావేశం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ, ఉపాధ్యక్షులు ఎస్.లక్ష్మీనారాయణ, కోశాధికారి ఎన్. భిక్షపతి, సలహాదారు లక్ష్మణ్ గౌడ్, రాష్ట్ర బాధ్యులు పద్మజారాణి ,ఎస్.అరుణోదయ, షాబీర్, జహంగీర్, నసీరుద్దీన్, విష్ణుమూర్తి, జాన్ షాహెదా వివిధ జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు.
సర్వీస్ ఉపాధ్యాయులకు’టెట్’ మినహాయింపునివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



