ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుల్గం దామోదర్ రెడ్డి, సుంకరి భిక్షం గౌడ్‌లతో కలిసి సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ విద్యామండలి చైర్మెన్ పంకజ్ అరోరాను కలిసి వినతిపత్రం సమర్పించారు. వారు సానుకూలంగా స్పందించారనీ, కేంద్ర మంత్రితో జరిగే సమావేశంలో విద్యాహక్కు చట్టాన్ని సవరణ చేయడం ద్వారా లేదా సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్‌పై కేంద్ర ప్రభుత్వం తరపున ఇంప్లీడ్ అయి సరైన వాదనలు వినిపించి ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. అదే విధంగా ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న బి.ఇడి అర్హత కలిగిన సెకెండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు త్వరలోనే ఇన్‌సర్వీస్ షార్ట్ టర్మ్ డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టనున్నట్టు ఆరోరా తెలిపినట్టు నాయకులు వెల్లడించారు. దీంతో ఎస్జీటీలకు పీఎస్ హెచ్‌ఎంగా పదోన్నతి పొందడానికి మార్గం సుగమమవుతుందని వారు వెల్లడించారు.
ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



