8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా..
తెలంగాణకు తీరని అన్యాయం: కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ సర్కారుతో తెలంగాణకు గుండు సున్నానే దక్కిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర బడ్జెట్‌పై ఎక్స్ వేదికలో స్పందించారు. పన్నేండేండ్లుగా తెలంగాణను మోసం చేయటం బీజేపీకి అలవాటుగా మారిందని పేర్కొన్నారు. కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటూ ప్రధాని మోడీ నిత్యం చెబుతూ ఆచరణలో మాత్రం పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విభజన హామీలు సహా తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన నిధులన్నింటినీ పెండింగ్‌లో పెట్టారని విచారం వ్యక్తం చేశారు. స్థిరత్వం, క్రమశిక్షణ, వృద్ధి అంటూ నినాదాలు చెప్పే బీజేపీ పెద్దలు ఎందుకు తెలంగాణ విషయంలో వివక్ష చూపుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి మాత్రం గుండు సున్నా ఇచ్చారని కవిత విమర్శించారు. రూ. 34,367 కోట్లతో చేపట్టాల్సిన రీజినల్ రింగ్ రోడ్, హైవేలు, రేడియల్ రోడ్లకు నిధులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు ఇవ్వాల్సిన 50 శాతం నిధులు ఇవ్వలేదన్నారు. కొత్త రైల్వే లైన్స్‌కు క్లియరెన్స్‌లు ఇవ్వకపోగా, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని అటకెక్కించారని మండిపడ్డారు. తెలంగాణకు దక్కాల్సిన ఐఐఎం, 16 నవోదయ విద్యాలయాలు, 9 కేంద్రీయ విద్యాలయాలను ఇవ్వటం లేదని గుర్తుచేశారు. విభజన చట్టం హామీలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
12వ బడ్జెట్‌లోనూ తెలంగాణకు గుండు సున్నానే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



