Sunday, November 2, 2025
E-PAPER
Homeసినిమాక్రికెట్‌ నేపథ్యంలో..

క్రికెట్‌ నేపథ్యంలో..

- Advertisement -

సుడిగాలి సుధీర్‌, దివ్యభారతి జంటగా నటిస్తున్న చిత్రం ‘గోట్‌’. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు తుది దశకి చేరుకున్నాయి. జైశ్నవ్‌ ప్రొడక్షన్‌, మాహాతేజ క్రియేషన్స్‌లో ‘అద్భుతం, టేనంట్‌’ వంటి చిత్రాలను నిర్మించిన మొగుళ్ళ చంద్రశేఖర్‌ నిర్మాణంలో క్రికెట్‌ నేపథ్యంలోనే కామెడీ ప్రధాన అంశంగా ఈ చిత్రం తెరకెక్కింది.
నిర్మాత మొగుళ్ళ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ,’సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నేను నిర్మించిన సినిమాలలో మంచి చిత్రంగా ఈ సినిమా నిలుస్తుంది. త్వరలోనే టీజర్‌, పాటలను రిలీజ్‌ చేస్తాం’ అని తెలిపారు.
మొట్ట రాజేంద్రన్‌, సర్వదమన్‌ బెనర్జీ, నితిన్‌ ప్రసన్న, పథ్వి, అడుకులం నరైన్‌, ఆనందరామరాజు, పమ్మి సాయి, చమ్మక్‌ చంద్ర, నవీన్‌ నేని తదితరులు నటిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -