Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeసినిమాప్రేమ, ప్రతీకారం నేపథ్యంలో..

ప్రేమ, ప్రతీకారం నేపథ్యంలో..

- Advertisement -

హీరో అడివి శేష్‌ నటిస్తున్న కొత్త చిత్రం ‘డకాయిట్‌’. ప్రేమ-ప్రతీకార కథనం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు షానియల్‌ డియో దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం మణాల్‌ ఠాకూర్‌ బర్త్‌డే సందర్భంగా ఆమె పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘ఈ కథలో జూలియెట్‌ కేవలం లవ్‌ ఇంటరెస్ట్‌ కాదు, రివెంజ్‌ డ్రామాకి సెంట్రల్‌ క్యారెక్టర్‌. మణాల్‌ పోషించిన జూలియట్‌ పాత్ర తెలుగులో ఇప్పటివరకు చూసిన హీరోయిన్ల పాత్రల కంటే వేరే లెవెల్లో ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీడ్‌ యాక్టర్స్‌తో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న రిలీజ్‌ చేస్తున్నారు’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్‌ నారంగ్‌ సహ నిర్మాత. భీమ్స్‌ సిసిరోలియో మ్యూజిక్‌ సమకూరుస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad