Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చి'వరి'దశలో..నేలవాలిన ఆశలు

చి’వరి’దశలో..నేలవాలిన ఆశలు

- Advertisement -

పంటలను దెబ్బతీస్తున్న వానలు
దిక్కుతోచని స్థితిలో రైతులు
నవతెలంగాణ-పెద్దవంగర
వానాకాలం పంటలపై ప్రతికూల వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయి. జూలై మాసం వరకు సాధారణంగానే నమోదైన వర్షపాతం ఆ తరువాత ఏర్పడ్డ వాతావరణ పరిస్థితుల కారణంగా వరుసగా మోతాదుకు మించి వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెరువులు, కుంటలు నిండు కుండను తలపిస్తూ అలుగుపారుతున్నాయి. అయితే ఇటీవల వరుసగా కురుస్తున్న వర్గాలు పంటలను దెబ్బతీస్తున్నాయి. ప్రధానంగా ఈ నెలలో కురుస్తున్న వర్షాలతో అధిక నష్టం వాటిల్లితుందని రైతులు వాపోతున్నారు.

మండలంలో ప్రధానంగా సాగు చేసిన వరి పంటకు వరుసగా కురుస్తున్న వర్షాలతో కొంత మేలుతో పాటు, నష్టాన్ని మిగుల్చుతుందని రైతులు చెబుతున్నారు. ప్రతీ నెలలో కొద్దిరోజుల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండడం, ఆ తరువాత ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పైర్లు ఏపుగా పెరిగి, యూరియా అవసరాన్ని కాసింత తగ్గించాయి. ఇదే దశలో వ్యవసాయ క్షేత్రాల్లో నీటి నిల్వ అధికంగా ఉండడంతో పొట్ట కుళ్లు తెగులు ఆశించి పైర్లు దెబ్బతింటున్నాయి. మండలంలో 19,330 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, వరిసాగు 13,300 ఎకరాల్లో నమోదైంది. ప్రస్తుతం వరి పైర్లు సూది పొట్ట దశకు చేరుకోగా, మరికొన్ని చోట్ల ఈత పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరికోస్తున్నారు. ఈ తరుణంలో గత వారం రోజులుగా క్రమేపీ కురుస్తున్న వర్షాలకు వరి కంకి సుంకురాలిపోతుంది. దీని ప్రభావంతో దిగుబడులు తగ్గడమే గాక, ధాన్యం తూకంలో తేడాలు వచ్చే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరి చి’వరి దశలో..

మండల పరిధిలోని పెద్దవంగర, బొత్తల తండా, వడ్డెకొత్తపల్లి, కొరిపల్లి గ్రామాల్లో వరి పైర్లు ఈతపట్టి కంకిదశలో ఉన్నాయి. వారం రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా చివరి దశకు చేరిన పంట పైర్లు దెబ్బతింటున్నాయి. ఆదివారం కురిసిన గాలివాన దాటికి చివరి దశకు వచ్చిన వరి పైర్లు నేలవాలింది. దీంతో రైతులు ఆరుగాల కష్టంపై పెట్టుకున్న ఆశలు ఆవిరైపోతుంటే కంటనీరు చెమ్మగిల్లుతుంది. 

నేలవాలిన వరిపైరు కట్ట కట్టాలి

ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో వరిపైరు వేరు వ్యవస్థలో పట్టుతప్పి నేల వాలిపోయింది. పాల కంకి దశలో నేలవాలిన పంట దిగుబడిని కాపాడుకునేందుకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నేలవాలిన వరిపైరు కట్ట కట్టాలి -గుగులోత్ స్వామి నాయక్ (మండల వ్యవసాయాధికారి)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -