అంతిమంగా న్యాయమే గెలిచింది..

In the end justice won..– 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న నాయకులు…
నవతెలంగాణ – డిచ్ పల్లి
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు మంగళవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా డిచ్ పల్లి మండల కేంద్రంలోని  శివాలయం, పనసత హనుమాన్ ఆలయాల వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులను తీర్చి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు శక్కరి కొండ కృష్ణ, సీనియర్ నాయకులు నల్లవెల్లి సాయిలు,నీరడి పద్మారావు, ఒడ్డం నర్సయ్య, మాజీ  కో ఆప్షన్ సబ్యులు షేక్ నయీమ్ మాట్లాడుతూ కావాలనే కొన్ని రాజకీయ పార్టీలు బిఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టడానికి శతవిధాల ప్రయత్నాలు చేశారని, తమ పార్టీల ఉనికికాపాడుకోవడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై లేనిపోని ఆరోపణలు చేసి జైలు పాలు చేశారని, ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అంతిమంగా న్యాయమే గెలిచిందని వారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గీతా, గంగాధర్, సూదం, గంగభూషణ్, మోహన్, జాకిర్, పింటూ, వికాస్, భూమన్న, రాజేశ్వర్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love