Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర చరిత్రలో గ్రామంలో ఒకే ఒక వార్డుకు ఎన్నిక

రాష్ట్ర చరిత్రలో గ్రామంలో ఒకే ఒక వార్డుకు ఎన్నిక

- Advertisement -

– సర్పంచ్, ఉప సర్పంచ్, ఏడు వార్డ్ నెంబర్లు ఏకగ్రీవం 
– 8 వార్డులలో ఒకే ఒక వార్డుకు ఎన్నిక, కాంగ్రెస్ కైవసం
– సర్పంచ్ గా మారెడ్డి కొండల్ రెడ్డి, ఉప సర్పంచ్ గా బండి అశోక్ 
నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్ 

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎక్కడలేని విధంగా ఎనిమిది వార్డులలో ఒకే ఒక వార్డుకు ఎన్నిక నిర్వహించారు. సర్పంచ్, ఉప సర్పంచ్, ఏడు వార్డ్ సభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. గురువారం, యాదగిరిగుట్ట మండలం మైలార్ గూడెం, సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన మారెడ్డి కొండల్ రెడ్డి ఏకగ్రీవం, ఉప సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బండి అశోక్ ఏకగ్రీవం, ఏడు వార్డు నెంబర్లు ఏకగ్రీవం అయ్యాయి.

మిగిలిన మూడవ వార్డుకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నాతి నరసింహా అత్యధిక మెజారిటీతో సాధించారు. ఏకగ్రీవమైన వార్డు సభ్యులు గోపాల పద్మ, కాదూరి లలిత, గుండ్లపల్లి కవిత, చిన్నం గణేష్, రాపోలు సతీష్ రెడ్డి, అల్లం మానస ఉన్నారు. ఎన్నికైన వారిని గ్రామ ప్రజలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కొండల్ రెడ్డి, బండి అశోక్ లు మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామని అన్నారు. స్థానిక నాయకులతో, ఆలేరు ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాను ప్రకాష్, యాదగిరిగుట్ట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కాటంరాజు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -