హీరో నాని నటిస్తున్న పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘రా’ స్టేట్మెంట్, రెండు పవర్‌ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్లతో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం బిహైండ్ ది సీన్స్ ‘స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్’ గ్లింప్స్‌తో అందరిలో అంచనాలను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్ళింది. ‘ది ప్యారడైజ్’ను గ్లోబల్ సినిమా విజన్‌తో చాలా గ్రాండ్ స్కేల్‌లో రూపొందిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఫస్ట్ గ్లింప్స్‌తో మేకర్ల యూనివర్సల్ విజన్ అందరికీ అర్థమైంది. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్, బోల్డ్ ప్రమోషన్స్.. అన్నీ గ్లోబల్ మూవీ దిశగానే సాగుతున్నాయి.
ఇక తాజాగా మేకర్స్ హాలీవుడ్‌లోని కనెక్ట్‌మాబ్ సీన్ ఎగ్జిక్యూటివ్ విపీ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ అలెగ్జాండ్రా ఈ. విస్కోంటిని కలసి సినిమా కోసం కొలాబరేషన్ డిస్కస్ చేస్తున్నారు. మొదటినుంచే ఈ ప్రాజెక్ట్‌ని రీజనల్ సినిమా లాగా కాకుండా, పాన్-వరల్డ్ మూవీలా ట్రీట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ మొత్తం ఎనిమిది భాషల్లో విడుదల కానుంది.
పాన్ వరల్డ్ రేంజ్‌లో..
- Advertisement -
- Advertisement -