– ఆందోళనలకు సిద్ధమైన కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలుొ
– హైదరాబాద్‌లో ఎస్వీకే నుంచి ఇందిరా పార్కు వరకు మహాప్రదర్శన
– జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లోనూ నిరసనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జాతీయ సార్వత్రిక సమ్మెలో పాల్గొనేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధమయ్యారు. కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలన్నీ ఏకకాలంలో ఈ సమ్మెలో భాగస్వామ్యం అవు తున్నాయి. దీనిలో భాగంగా బుధవారం హైదరా బాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం(ఎస్వీకే) నుంచి ఇందిరాపార్కు ధర్నా చౌక్ వరకు అన్ని సంఘాల సంయుక్తాధ్వర్యంలో మహా ప్రదర్శన చేపట్టనున్నారు. అలాగే హైదరాబాద్‌లోనే ఐఎస్ సదన్ చౌరస్తా నుంచి ఓవైసీ ఆస్పత్రి వరకు వేలాది మంది కార్మికులు ప్రదర్శన నిర్వహిం చేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా, మండల, పారిశ్రామిక కేంద్రాలు, గ్రామాల్లోనూ ప్రదర్శనలు, సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సింగరేణి, బీడీఎల్, బెల్, డీఈఎల్, మిథాని, హాల్, తదితర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని కార్మికులు, ఉద్యోగులు కూడా తమ విధుల్ని బహిష్కరించి సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. రవాణా రంగంలోని కార్మికులూ ఈ నిరసనల్లో భాగస్వామలు అవుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ, ప్రయివేటు ట్రాన్స్‌పోర్టు వాహనాలు నిలిచిపోనున్నాయి. ఆర్టీసీలోని 13 కార్మిక సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చి, జేఏసీగా ఏర్పడి సమ్మెకు మద్దతు ప్రకటించాయి. వ్యవసాయ కార్మికులు, రైతులు గ్రామీణ బంద్‌ను నిర్వహించనున్నారు. స్కీమ్ వర్కర్లు కూడా ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు.
రాష్ట్రంలో…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES