Thursday, February 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రచార రథం ప్రారంభోత్సవం

ప్రచార రథం ప్రారంభోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
బాల్య వివాహ ముక్త భారత్ ప్రచార రథం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహింపు స్కోప్ స్వచ్ఛంద సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు కట్టుబడి, బాలల హక్కుల పరిరక్షణ దిశగా ఒక కీలక ముందడుగు వేస్తూ “బాల్య వివాహ ముక్త భారత్ ప్రచార రథం”ను జిల్లా దినం కలెక్టర్ భాస్కరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో బాల్య వివాహాలపై అవగాహన పెంపొందించడం, బాలికల విద్య, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, చట్టపరమైన చర్యలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించడం లక్ష్యంగా నిర్వహించబడుతోందనారు. బాల్య వివాహాలు బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరికట్టడంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

ప్రచార రథం ద్వారా గ్రామాలు, మండలాలు, పాఠశాలలు, కాలేజీలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. బాల్య వివాహాల నిషేధానికి సంబంధించిన చట్టాలు, ముఖ్యంగా ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్   గురించి ప్రజలకు వివరించబడుతుంది. అలాగే, బాల్య వివాహాల సమాచారాన్ని తెలియజేయడానికి ఉపయోగపడే  చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్  నిర్వహించే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ సేవల గురించి కూడా విస్తృత ప్రచారం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ, మహిళా, శిశు అభివృద్ధి శాఖ, విద్యాశాఖ, కార్మిక శాఖ, జిల్లా బాలల పరిరక్షణ యూనిట్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు , బాలరక్ష భవన్ కోఆర్డినేటర్ అనంతలక్ష్మి , స్కోప్ కోఆర్డినేటర్ సోమ నరసయ్య ,సిడబ్ల్యూ సి మెంబర్ శివరాజ్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ దశరథ, హబ్ కో ఆర్డినేటర్ హర్ష, సీనియర్ సెక్రటరీ సోమేశ్ కుమార్, స్కోప్ సంస్థ ప్రతినిధులు నరసింహారాజు, అశ్విని, వెంకటేష్ , బాల రక్ష పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -