– మత్స్యకార సొసైటీలకు 6 లక్షల చేప పిల్లలు పంపిణీ
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని 49 చెరువులో చేపలు పెంచేందుకు గాను బొచ్చ (2.10 లక్షలు), రోహు (2.10 లక్షలు) బంగారు తీగ (1.80 లక్షలు) మొత్తం 6 లక్షల చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామని ఆత్మ (బీఎఫ్ఏసీ ) చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్యశాఖ ఆద్వర్యంలో అందించే ఉచిత చేప పిల్లలు. పంపిణీ ని ఆయన మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ బి.నాగరాజు ,మత్స్యశాఖ అధికారి మిడియం మంగ రాజు,పంచాయతీ కార్యదర్శి సబిత,మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు, బేతి కృష్ణ లు పాల్గొన్నారు.



