Wednesday, April 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజలకు ఇబ్బందుల్లేకుండా ఆదాయం పెంచాలి

ప్రజలకు ఇబ్బందుల్లేకుండా ఆదాయం పెంచాలి

- Advertisement -

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రవాణాశాఖలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆదాయాన్ని పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో రవాణా శాఖ అధికారులతో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 2024-25 లో రవాణా శాఖకు రూ. 6910.90 కోట్ల ఆదాయం రాగా ,2025-26 లో రూ. 7097 .38 కోట్లు వచ్చిందని గుర్తు చేశారు. ఈవీ పాలసీ ద్వారా రవాణా శాఖ ఆదాయం కొంతమేర తగ్గినట్టు వివరించారు. తగ్గిన ఆదాయాన్ని ఎన్ఫోర్స్మెంట్‌ శాఖ ఆదాయ మార్గాలు పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో ఇచ్చిన టార్గెట్‌ను అధిగ మించి లైఫ్‌టాక్స్‌, త్రైమాసిక టాక్స్‌ వసూలులో మంచి పనితీరు కనపరచారంటూ అధికా రులను అభినందించారు. పలువురు అధి కారులకు పనితీరు మెరుగు పరచుకోవాలని హెచ్చరించారు.

నిజామాబాద్‌ – మహారాష్ట్ర , ఆదిలాబాద్‌ – మహారాష్ట్ర, మెదక్‌ – కర్నాటక తదితర సరిహద్దు జిల్లాల రవాణా శాఖ అధికారులు ఇతర రాష్ట్రాల వాహనాల పన్ను చెల్లింపు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్టీవో కార్యాలయాల్లో పెండింగ్‌ లైసెన్సులు ఇతర పౌర సేవలకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. రవాణా శాఖలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని ప్రకటించారు. రవాణా సేవలు పారదర్శకంగా సమర్థవంతంగా వాహనదారులకు అందేలా డీలర్ల వద్ద వాహనాల రిజిస్ట్రేషన్‌ జరుగుతుం దనీ, ఈ విషయంలో వాహనదా రులకు ఇబ్బందులు లేకుండా రవాణా శాఖ అధి కారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. వాహ న్‌ పోర్టల్‌ ద్వారా సేవలు డేటా పూర్తిచేసుకొని టెక్నికల్‌ సమస్యలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. సారథి అమలులోకి వచ్చిన తర్వాత ఎనిమిది నెలల్లోనే దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఏఎంవీఐలకు ఇచ్చిన శిక్షణ మాదిరి ఇతర రవాణా శాఖ అధికారులకు విడతల వారిగా శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. రవాణా శాఖ గౌరవాన్ని పెంపొందించేలా అధికారులు పని చేయాలని సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 13 నుంచి నిర్వహించే అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమాన్ని పోలీస్‌, రవాణా శాఖ సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ఆటోల ఓవర్‌ లోడ్‌, సీటు బెల్టు పెట్టుకోకపోవడం, హెల్మెట్‌ లేకపోవడంతో మరణాలు సంభవిస్తు న్నాయని చెప్పారు. వాటిపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈనెల 13-18 మధ్య అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమంలో 15 నుంచి 18 వ తేదీ మధ్యలో ఉమ్మడి జిల్లాల వారిగా రవాణా శాఖ మంత్రిగా తను, ఆర్టీసీ ఎండీ, డీజీపీ, రవాణా శాఖ కమిషనర్‌ సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో 37 ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ మంజూరు అయ్యాయనీ, జూన్‌ ఒకటిన తొలి టెస్టింగ్‌ స్టేషన్‌ ప్రారంభించుకునేలా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌రాజ్‌, రవాణా శాఖ కమిషనర్‌ ఇలాంబర్తి, జెటీసీలు చంద్రశేఖర్‌ గౌడ్‌, శివలింగయ్య, రమేష్‌, డీటీసీలు, డీటీవోలు, ఆర్టీవోలు, ఏంవీఐలు, ఏఎంవీఐలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -