నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణములోని బస్టాండ్ ముందు ప్రధాన రహదారి పై ఉన్న డ్రైనేజీపై నిర్మించే బ్రిడ్జి పనులకు ఏమైంది.? ఎందుకు పనులు జరగడం లేదని పట్టణంలో ప్రతి చోటా ప్రజలు చర్చించుకుంటున్నారు. పట్టణం రోజు రోజుకు విస్తరిస్తుంది.. జనాభా పెరుగుతుంది. వాహనాల సంఖ్య కూడ పెరుగుతుంది. పెరిగిన వాహనాలకు అనుకూలంగా రహదారి విస్తరణ లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఉదయం పాఠశాలకు వెళుతున్న సందర్భంలో సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న సందర్భంలో రోడ్లపై వాహనాల సంఖ్య తీవ్రంగా ఉంటుంది. బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడంతో ఒక రోడ్డు పై రెండువైపులా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిసెంబర్ లో పనులు ప్రారంభించారు. నాలుగు నెలలు గడుస్తున్న పూర్తి చేయడం లేదు. పాలకులు పట్టణ ప్రజలకు కనీస వసతులు సౌకర్యాలు కల్పించడంలో విఫలం అవుతున్నారని చాయ్ క్లబ్, జ్యూస్ సెంటర్, బస్టాండ్ చెట్ల కింద పలువురు జోరుగా చర్చించుకుంటున్నారు. సంబంధించిన అధికారులు వెంటనే బస్టాండ్ ముందు ప్రధాన రహదారిపై బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.



