Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచండి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచండి

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, పర్యవేక్షణ అధికారులు, నర్సింగ్ అధికారులకు పీహెచ్సీలలో, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను పెంచడంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి డిఎంహెచ్ఓ రాజశ్రీ మాట్లాడుతూ.. ప్రతి ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలో ఏఎన్ఎం మరియు ఆశ లు ఈ డి డి – అర్హులైన గర్భిణీ స్త్రీల జాబితాను ఉంచుకోవాలని, ప్రతి గర్భిణీ స్త్రీ కి నాలుగు పరీక్షలు చేయించాలని వాటిలో రెండింటిని స్త్రీ వైద్య నిపుణురాలు చేత చేయించాలని, ఎత్తు, బరువు, నమోదు చేసి హెచ్ బి ని పరీక్షించాలని రక్తహీనత గల గర్భిణీ స్త్రీలను ముందే గుర్తించి వారికి పోషకాహారం ఐరన్ మాత్రలు, ఐరన్ సూక్రోజ్, తీసుకొనేలా అవగాహన కలిగించాలన్నారు.

 ప్రైమీ కేసెస్ అన్ని సిజేరియన్ శస్త్ర చికిత్సలు కావని అత్యంత ప్రమాదకర లక్షణాలు గల గర్భిణీ స్త్రీలు మాత్రమే శస్త్ర చికిత్సలు చేయించుకోవాలని మిగతా గర్భిణీ స్త్రీలు అందరికీ సాధారణ ప్రసవాల కై ప్రోత్సహించలని,యోగ చేసేలా, పోషకాహారం తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీని హెచ్ఎంఐ ఎస్ డాటా లో నమోదు చేయాలని, నర్సింగ్ ఆఫీసర్లు అందరూ సాధారణప్రసవాలు చేయాలని, ఆశలు, ఏఎన్ఎంలు గృహ సందర్శనలో ప్రతి గర్భిణీ స్త్రీని మరియు ప్రసవానంతర సేవలకై తల్లులను వారికి ఆరోగ్య పరీక్షలను నిర్వహించాలని తెలియజేశారు. తక్కువగా ప్రసవాలు చేసిన పి హెచ్ సి ల వైద్యాధికారులను సిబ్బందిని ప్రసవాలు పెంచేలా అందరూ పనిచేయాలని తెలియజేశారు.

ప్రమాదకర లక్షణాలు గల గర్భిణీ స్త్రీలను ప్రత్యేక దృష్టితో పర్యవేక్షించాలని వారిని ప్రసవానికి ముందే బర్త్ ప్లాన్ ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లాలని సూచించారు. తద్వారా మాతా శిశు మరణాలను తగ్గించవచ్చని తెలియజేశారు. ఇంకా ప్రోగ్రాం ఆఫీసర్ ఎం సి హెచ్ డాక్టర్ శ్వేతా మాట్లాడుతూ పి హెచ్ స్సీలకు కేటాయించిన టార్గెట్లను 100% పూర్తిచేయాలని మాతృ మరణాలను 24 నుండి 48 గంటల్లోపు,42 కాలం ఫార్మాట్లో పూర్తి చేసి డిఎంహెచ్ఓ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలని తద్వారా కలెక్టర్ గారితో సమీక్ష నిర్వహించవచ్చు అన్నారు. అదేవిధంగా సికిల్ సెల్ అనేమియా కేసులను ఫాలోఅప్ చేయాలని సూచించారు.

డాక్టర్ అశ్విని గారు మాట్లాడుతూ మొదటగా పి హెచ్ స్సి కి గర్భిణీ స్త్రీ రాగానే హైరిస్కు లేదా సాధారణ గర్భిణీ స్త్రీ అని గుర్తించాలన్నారు క్షేత్రస్థాయి సేవలను విస్తృతం చేస్తూ ఐరన్ సుక్రోజ్ క్యాలిక్యులేషన్ నిర్వహించాలని, సికిల్ సెల్ అని మీయా,తల సేమియా కేసులను ప్రత్యేకంగా గుర్తించాలని ప్రతి ఆశకు ఏఎన్ సీలను అటాచ్ చేస్తూ సూపర్వైజర్స్ ఫాలో ఆఫ్ చేయాలని ప్రస్తుత నెల ఈ డి డిలే కాకుండా వచ్చేనెల ఈ డి డీలను కూడా గుర్తించాలని తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం ఎం హెచ్ ఓ డాక్టర్ రమేష్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, ఏవో రాజేశ్వర్ వివిధ పి హెచ్ స్సీల వైద్యాధికారులు, పర్యవేక్షకఅధికారులు నర్సింగ్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -