నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగింది. కొన్ని రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో తెలంగాణ గజగజ వణుకుతోంది. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో చలి మరింత తీవ్రం కానుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది. వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 8.5 డిగ్రీల నుంచి 12.5 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోవచ్చని తెలిపింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు చలికి వణికిపోతున్నాయి. మంగళవారం రాత్రి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో అత్యల్పంగా 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



