నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
తెలంగాణలో బీడీ పరిశ్రమలో సుమారు 7 లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి కరువు భత్యం 55 పాయింట్లు పెరిగింది. పాయింటుకు పది పైసలు చొప్పున రూ 5- 50 పైసలు చొప్పున ప్రతి 1,000 బీడీలకు అదనంగా కూలి చెల్లించాలి అదేవిధంగా నెలసరి జీతాల ఉద్యోగులకు నెల ఒకటి 165 రూపాయలు పెరిగింది. అదేవిధంగా బీడీ ప్యాకర్లకు రోజుకు రు 5- 50 పైసలు చొప్పున వివిధ నమూనాగలిగినటువంటి బీడీ ప్యాకింగ్ కు లక్షకు ఎంత అనేటటువంటిది నిర్ణయించబడుతుంది
ఈ పెరిగినటువంటి కరువు భత్యం 1 – 4- 2026 నుంచి అమల్లోకి వస్తుంది . ఈ కరువు భత్యం పెరుగుదల రాష్ట్రంలో గల 7 లక్షల మంది బీడీ కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. కనుక బీడీ లుచుట్టే కార్మికులు నెలసరి వేతనాల ఉద్యోగులు బీడీ ప్యాకింగ్ కార్మికులు అందరూ ఐక్యంగా సంఘటితంగా యజమాన్యాలతో పోరాడి అమలు చేయించుకోవాల్సిందిగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తుంది.



