Monday, March 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎన్పీడీసీఎల్‌లో పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌

ఎన్పీడీసీఎల్‌లో పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉత్తర ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్‌)లో విద్యుత్‌ డిమాండ్‌ ఒక్కరోజులోనే మరింత పెరిగింది. శనివారం 6,057 మెగావాట్లు నమోదు కాగా, ఆదివారం 6,267 మెగావాట్లకు చేరుకుంది. 24 గంటల్లోనే 210 మెగావాట్లకు చేరుకుందని సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. డిమాండ్‌ ఎంత పెరిగినా సరఫరాలో అంతరాయం రాకుండా వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వచ్చే వేసవిలో డిమాండ్‌ మరింత పెరిగినా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎండీ వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -