– పది శాతం డిస్కౌంట్ ప్రజలను మోసం చేయడమే : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-సిటీబ్యూరో
పెంచిన మెట్రో చార్జీలను పూర్తిగా రద్దు చేయాలని, ఈనెల 24 నుంచి పది శాతం డిస్కౌంట్ ఇస్తామని ఎల్‌అండ్‌టీ యాజమాన్యం చెప్పడం ప్రజలను పూర్తిగా మోసం చేయడమేనని సీపీఐ(ఎం) అభిప్రాయపడింది. ఈ మేరకు బుధవారం ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 17న మెట్రోచార్జీలు భారీగా పెంచి కంటితుడుపు చర్యగా 10 శాతం తగ్గిస్తామనడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. పెరిగిన మెట్రో చార్జీలు, నిర్ణయించిన స్లాబుల వల్ల ఒక్కో ప్రయాణికుడిపై నెలకు వెయ్యి నుంచి రూ.2వేలకు వరకు భారం పడుతుందని, అందువల్ల పెంచిన చార్జీలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెట్రో రైల్ నష్టాలకు ఎల్‌అండ్‌టీ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. పెంచిన చార్జీలపై ముఖ్య మంత్రి, కేంద్ర మంత్రులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. మెట్రో స్టేషన్‌ల వద్ద పార్కింగ్ ఫీజులు వసూలు చేయడంతోపాటు టాయిలెట్లలో డబ్బులు వసూలు చేయడాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రయాణి కులకు మెరుగైన సేవల కోసం మెట్రోరైల్ బోగీలను పెంచాలని పేర్కొన్నారు.
పెంచిన మెట్రోచార్జీలు పూర్తిగా రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES