– డీఆర్డీఓ ఏపీడీ ఎన్.రవి
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్ తో ఆధార్ అనుసంధానంతో ఉపాధి హామీలో పారదర్శకత పెంపొందుతుంది అని డీఆర్డీఓ ఏపీడీ ఎన్.రవి అన్నారు. గురువారం ఆయన అశ్వారావుపేటలో పర్యటించారు. జాబ్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరు తప్పని సరిగా ఈకేవైసీ చేయించుకోవాలని తెలిపారు.గురువారం వినాయకపురం లో జరుగుతున్న ఉపాధి పనుల తీరును పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. అంతకు ముందు పంచాయతీ కార్యాలయం ఆవరణలో చేపట్టిన స్వచ్ఛతా ఈ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ చిలకల గండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో స్వచ్ఛ భరత్ మిషన్ నిధులు రూ.3 లక్షలతో చేపట్టిన సామాజిక మరుగుదొడ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో అప్పారావు, ఏపీవో రామచంద్రరావు, కార్యదర్శి సందీప్, సిబ్బంది ముత్తా రావు, మధు పాల్గొన్నారు.
జాబ్ కార్డ్-ఆధార్ అనుసంధానంతో పారదర్శకత పెంపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES