నవతెలంగాణ – అశ్వారావుపేట
చదరంగం ఆడుతూ ఉంటే తార్కిక మేధ పెంపుదల తో పాటు,ఆటలో ప్రత్యర్ధులను ఎదుర్కొనే విధానం పై అవగాహన పెంపొందుతుంది అని అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత అన్నారు. పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిబిరంలో విద్యార్ధులకు శనివారం చదరంగం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదరంగం ద్వారా విద్యార్ధులకు వినోదం తోపాటు ఉన్నత మైన వ్యక్తిత్వాన్ని,వ్యూహాత్మక ఆలోచనలను అభివృద్ధి చేయవచ్చునని అన్నారు. శిబిరంలో నిర్వహించిన చదరంగం పోటీలలో 9 వ తరగతి చదువుతున్న డి.ధరణి విజయాన్ని సాధించగా 6వ తరగతి చదువుతున్న ఇ.లోకేష్ ద్వితీయస్థానంలో నిలిచాడు. విజేతలకు శిక్షణాశిబిరం ముగింపు రోజున బహుమతులను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.కొండలరావు,సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు, పి.ఇ.టి రాజు తదితరులు పాల్గొన్నారు.
చదరంగం తో తార్కిక మేధ పెరుగుదల: హెచ్ ఎం పరుచూరి హరిత.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES