Wednesday, July 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థి దశనుంచే సామాజిక బాధ్యత కలిగించేలా ఇందూరు యువత 

విద్యార్థి దశనుంచే సామాజిక బాధ్యత కలిగించేలా ఇందూరు యువత 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
విద్యార్థి దశ నుంచే సామాజిక బాధ్యత కలిగించేలా సింగర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి పార్షి అశోక్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారి పార్శి అశోక్, ట్రస్మా కార్యవర్గం కలిసి ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ద్వారా విద్యార్థులకు సేవా కార్యక్రమాలపై అవగాహన సోషల్ సర్వీస్ ఫీల్డ్ వర్క్ ప్రాజెక్టు కి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.    అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి పార్శి అశోక్  మాట్లాడతూ..  ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ చేసే కార్యక్రమాలు అందరికి స్ఫూర్తివంతమైనవని అన్నారు.

అలాగే విద్యార్థులకు చిన్నప్పటినుండే సేవా మార్గం వైపుగా నడిపించే దిశగా పాఠశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు కల్పించటం గోప్ప విషయం అన్నారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు చైతన్యవంతులౌతరన్నారు. అనంతరం ట్రస్మా కార్యవర్గం జయసింహ గౌడ్ మాట్లాడుతూ తమ వంతు సహకారం ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. అలాగే ట్రస్మా జిల్లా అధ్యక్షుడు నిత్యానందం మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించటం ద్వారా మంచి ఆలోచన సన్మార్గం వైపుగా సామాజిక బాధ్యతతో విద్యార్థులు సమాజంలో మంచి పౌరులుగా ఎదుగుతారన్నారు ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు ఈ.సి మెంబెర్స్ మద్ది గంగాధర్, ఐలేని సంతోష్ మరియు ట్రస్మా కార్యవర్గం నర్సింగరావు,అరుణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -