Saturday, November 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందల్ వాయి జిపిఓ మండల కార్యవర్గం ఎన్నిక..

ఇందల్ వాయి జిపిఓ మండల కార్యవర్గం ఎన్నిక..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి: ఇందల్ వాయి మండల గ్రామ పాలన అధికారి ( జి. పి. ఓ) కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా జంగిడి లింబాద్రి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బి సాయిలు, గౌరవ అధ్యక్షులుగా భూపతి విజయ్, ప్రధాన కార్యదర్శిగా సుంకరి సందీప్, కోశాధికారిగా నీరడి ప్రభాకర్, చైన్ సెక్రటరీగా మెరైడీ రాజేశ్వర్ సలహాదారులుగా 1 టి స్వప్న, సలహా ధారులు 2 గా 

మంత్రి ప్రమోద్, సలహా ధారులు 3 జాడల రంజిత్, ముఖ్య సలహాదారులుగా మీసాల రవీందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న కార్యవర్గ సభ్యులు తహసిల్దార్ వెంకట్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసి కార్యవర్గ సభ్యుల లిస్టును అందజేశారు. కార్యవర్గాన్ని ఎన్నుకోవడం అభినందనమని తాహసిల్దార్ గ్రామ పాలన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు జంగిడి లింబాద్రి, ప్రధాన కార్యదర్శి సుంకారి  సందీప్ లు మాట్లాడుతూ గత రెండు నెలల క్రితమే గ్రామ పాలన అధికారులుగా నియమకం పొందామని, మండలంలో గ్రామ పాలన అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించుకునే విధంగా కార్యవర్గ సభ్యులందరూ కలిసి కట్టుగా ఉంటామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -