- Advertisement -
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పస్రా పోలీస్ స్టేషన్ లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పస్రా స్టేషన్ లో శుక్రవారం అచ్చ కమలాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిఐ దయాకర్, ఎస్ఐ కమలాకర్ లు జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సిఐ దయాకర్ స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను సిబ్బందికి వివరించారు. అదేవిధంగా మండల ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -