నవతెలంగాణ – గోవిందరావుపేట
సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శి కడారి నాగరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర పోరాట అమరవీరులకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం జరిగిన సభలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చిట్టిబాబు మాట్లాడుతూ ఎందరో వీరుల పోరాట ఫలితంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు. దేశంలో రాజ్యాంగం ద్వారా సంక్రమించిన స్వేచ్ఛ సౌబ్రాతత్వం లౌకిక తత్వం హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయుడిపై ఉన్నదని పేర్కొన్నారు.
79 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా నిరుద్యోగం నిరక్షరాస్యత పేదరికం విలయతాండవం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో ప్రజల హక్కులను కాపాడడంలో నేటి పాలకులు పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు గొంది రాజేష్, తీగల ఆదిరెడ్డి నాయకులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ పురుషోత్తం రెడ్డి అశోక్ గణేష్ కవిత సువర్ణ పంజాల శ్రీనివాస్ అరుణ్ నారాయణ చెవ్వు లింగయ్య గణేష్ బ్రహ్మచారి సుమన్ సమ్మిరెడ్డి అంకుష్ రవి నూరుల్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES