నవతెలంగాణ – బాల్కొండ
మండల కేంద్రంలోని శాంభవి హై స్కూల్ లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు గ్రామంలో స్వాతంత్ర సమరయోధుల నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల త్యాగాల గురించి ఉపన్యాసించారు. అనంతరం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థినిలకు పాఠశాల ఉపాధ్యాయులు బహుమతులు ప్రదానం చేశారు . ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బొట్ల మధుసూదన్, కరస్పాండెంట్ బొట్ల రవీణ్ ప్రసాద్ , ప్రిన్సిపల్ ఇంద్రాణి, వైస్ ప్రిన్సిపల్ మంజుల ,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శాంభవి హైస్కూల్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES