దక్షిణాఫ్రికా-ఏతో అనధికార టెస్టు
బెంగళూర్ : దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో రెండో అనధికార టెస్టులో భారత్-ఏ ముందంజలో కొనసాగుతుంది. ధ్రువ్ జురెల్ (134 నాటౌట్) అజేయ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులు చేసిన భారత్-ఏ.. బౌలర్లు సమష్టిగా మెరవటంతో దక్షిణాఫ్రికా-ఏను తొలి ఇన్నింగ్స్‌లో 221 పరుగులకు కుప్పకూల్చింది. ప్రసిద్ కృష్ణ (3/35), మహ్మద్ సిరాజ్ (2/61), ఆకాశ్ దీప్ (2/28) రాణించటంతో 47.3 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా-ఏ 221 పరుగులకు ఆలౌటైంది. భారత్-ఏ రెండో ఇన్నింగ్స్‌లో 24 ఓవర్లలో 78/3తో ఆడుతోంది. అభిమన్యు ఈశ్వరన్ (0), సాయి సుదర్శన్ (23), దేవదత్ పడిక్కల్ (24) అవుటయ్యారు. కెఎల్ రాహుల్ (26 నాటౌట్), కుల్‌దీప్ యాదవ్ (0 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్-ఏ 112 పరుగుల ముందంజలో కొనసాగుతుంది.



