నవతెలంగాణ-హైదరాబాద్: రెండో రోజు కూడా పార్లమెంట్ లో పహల్గాం, ఆపరేషన్ సిందూర్, బీహార్ ఓటర్ల జాబితాపై చర్చ జరగాలని విపక్షాలు సభలో డిమాండ్ చేస్తున్నాయి. దీంతో తొలి రోజు ఉభయసభలు మూడు సార్ల వాయిదాపడిన విషయం తెలిసిందే. రెండో రోజు కూడా లోక్ సభ, రాజ్యసభలు ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నానికి ఉభయసభలు వాయిదపడ్డాయి. ఈక్రమంలో మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో ఇండియా కూటమి పార్టీ కీలక సమావేశం నిర్వహించాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇండియా కూటమి నేతలంతా చర్చించనున్నారు. అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై వ్యూహాలు రచించనున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా, తదనంతర పరిణామాలపై చర్చించనున్నారు. మరోవైపు ఇండియా కూటమి నుంచి ఆమ్‌ఆద్మీ పార్టీ వైదొలిగింది. నేటి సమావేశానికి ఆప్ మినహా మిగతా భాగస్వామ్య పక్షాలు మీటింగ్ హాజరుకానున్నారు.
ఇండియా బ్లాక్ పార్టీలు కీలక సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES