Friday, September 12, 2025
E-PAPER
Homeజాతీయంభారత్‌, మారిషస్‌ గమ్యం ఒకటే

భారత్‌, మారిషస్‌ గమ్యం ఒకటే

- Advertisement -

ఇకపై లోకల్‌ కరెన్సీలో వాణిజ్యం : మోడీ
వారణాసిలో మారిషస్‌ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాంతో ప్రధాని భేటీ

వారణాసి : భారత్‌, మారిషస్‌ రెండు దేశాలే అయినా వాటి కలలు, గమ్యాలు ఒకటేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇరు దేశాలు కేవలం భాగస్వామ్యులు మాత్రమే కాదనీ, ఒకే కుటుంబమని వ్యాఖ్యానించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో మారిషస్‌ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాంతో భేటీ అయిన ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో పలు కీలక రంగాల్లో ఇరుదేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ మారిషస్‌ ప్రత్యేక ఆర్థిక మండలి భద్రత, సముద్ర సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి భారత్‌ కట్టుబడి ఉందని అన్నారు. స్థానిక కరెన్సీలో వాణిజ్యం చేసేందుకు ఇరుదేశాలు నిర్ణయించాయని చెప్పారు. స్వేచ్ఛాయుత, బహిరంగ, సురక్షితమైన, స్థిరమైన, సంపన్నమైన హిందూ మహాసముద్రం భారత్‌, మారిషస్‌ రెండింటికీ ఉమ్మడి ప్రాధాన్యమని మోడీ పేర్కొన్నారు. భారత్‌ ఎల్లప్పుడూ వలసరాజ్యాల నిర్మూలనకు, మారిషస్‌ సార్వభౌమత్వాన్ని పూర్తిగా గుర్తించడానికి మద్దతు ఇచ్చిందని తెలిపారు.

అత్యున్నత పురస్కారం అందుకున్న మోడీ
రామ్‌గులాం ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. సెప్టెంబర్‌ 9వ తేదీన విచ్చేసిన ఆయన, 16 వరకు భారత్‌లోనే ఉండనున్నారు. తన పదవీకాలంలో ఆయన భారత్‌కు రావడం ఇదే తొలిసారి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -