– అంగీకరించిన పాక్ విదేశాంగ మంత్రి
ఇస్లామాబాద్: భారత వైమానిక దళం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందనే విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ అంగీకరించారు. మే నెలలో భారత్ 80 డ్రోన్లతో ఈ దాడిని నిర్వహిం చిందని, ఇది జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిగిందని పాక్ ప్రభుత్వం తెలిపింది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ ”వారు (భారత్) పాకిస్తాన్ వైపు డ్రోన్లను పంపారు. 36 గంటల్లో కనీసం 80 డ్రోన్లను పంపారు… మేము 80 డ్రోన్లలో చాలా వాటిని అడ్డుకోగలిగాము. అయితే కొన్ని డ్రోన్‌లు సైనిక స్థావరాన్ని దెబ్బతీసాయి. ఈ దాడిలో సిబ్బంది కూడా గాయపడ్డారు” అని తెలిపారు. ఈ దాడిలో తమ సైనిక స్థావరానికి జరిగిన నష్టం, సిబ్బందికి అయిన గాయాల గురించి కూడా ఆయన ప్రస్తావించడం గమనార్హం.
నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌పై డ్రోన్లతో భారత్ దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



