Tuesday, October 7, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌లో ఇండియా బ్లాక్ విజ‌యం ఖాయం: అశోక్ గ్లెహాట్

బీహార్‌లో ఇండియా బ్లాక్ విజ‌యం ఖాయం: అశోక్ గ్లెహాట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇండియా బ్లాక్ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ అశోక్ గ్లెహాట్ దీమా వ్య‌క్తం చేశారు. రేప‌ట్నుంచి బీహార్ రాష్ట్రంలో తాము ప్ర‌చారం ప్రారంభిస్తామ‌ని, దీంతో ప్ర‌చారంలో బీజీగా ఉంటామ‌ని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. బీహార్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ అధిష్టానం..ఆ రాష్ట్ర ఎన్నిక‌ల ప‌రిశీల‌కులుగా అశోక్ గెహ్లాట్, భూపేష్ బాఘేల్, అధిర్ రంజన్ చౌదరిలను పరిశీలకులుగా నియమించింది. ఈమేర‌కు పార్టీ అధిష్టానం ప‌త్రిక ప్ర‌క‌ట‌న జారీ చేసింది.

243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడ‌త‌ల్లో బీహార్ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం సోమవారం వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. వ‌చ్చే నెల న‌వంబ‌ర్ 6, 11 తేదీల్లో పోలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఈసీ పేర్కొంది. న‌వంబ‌ర్ 14న‌ ఫ‌లితాలు వెల్ల‌డిస్తామ‌ని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -