Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఇండియా బ్లాక్‌ ఎంపీల మార్చ్‌.. అడ్డుకున్న పోలీసులు

ఇండియా బ్లాక్‌ ఎంపీల మార్చ్‌.. అడ్డుకున్న పోలీసులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌ – న్యూఢిల్లీ : ఎన్నికల్లో, ఓటర్ల జాబితాలో మోసాలకు వ్యతిరేకంగా ఇండియా బ్లాక్‌ పార్టీల ఎంపీలు నేడు పార్లమెంట్‌ నుంచి ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వరకు మార్చ్‌ జరపనున్నారు. ఈ మార్చ్‌ ఈరోజు ఉదయం 11.30 గంటలకే ప్రారంభమైంది. అయితే ఈమార్చ్‌ జరగకూడదని కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. పోలీసులచేత భారీ బందోబస్తును, బారికేడ్లను ఏర్పాటు చేయించింది. అయినా సరే ప్రతిపక్ష ఎంపీలు వెనక్కి తగ్గలేదు.

పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం దాటుకుని ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ బారికేడ్లపై నుంచి దూకి మరీ ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. పోలీసులు అడ్డుకోవడంతో.. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిరసన చేసే ప్రదేశంలోనే కూర్చుని నిరసన చేశారు. ఈ మార్చ్‌లో పాల్గొన్న మహిళా ఎంపీలను సైతం పోలీసులు అడ్డుకోవడంతో వారు రోడ్డుపైనే కూలబడిపోయారు. కాంగ్రెస్‌ ఎంపి ప్రియాంకగాంధీతోపాటు సీపీఐ(ఎం)MPలు AA రహీమ్, అంత రామ్, జాన్ బ్రెట్టన్, కే రాధాకృష్ణన్, సు వెంకటేశం, వి శివదాసన్ త‌దిత‌రులు రోడ్డుపైనే బైఠాయించారు. ఈ నిరసనల్లో ఓట్లను దొంగిలించడం ఆపండి అని ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో ఢిల్లీ వీధులు మార్మోగిపోయాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img