Tuesday, July 22, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్ SIRను వ్య‌తిరేకిస్తూ ఇండియా బ్లాక్ నిర‌స‌న‌

బీహార్ SIRను వ్య‌తిరేకిస్తూ ఇండియా బ్లాక్ నిర‌స‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బీహార్‌లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌)ను వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌ వేదికగా ఇండియా బ్లాక్‌ నిరసన చేపట్టింది. మకర్‌ ద్వార్‌ ఎదుట లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఎస్‌ ఎంపి అఖిలేష్‌ యాదవ్‌, ఆర్‌జెడి ఎంపి మీసా భారతి, డిఎంకె ఎంపి కనిమొళి సహా పలువురు ఇండియా బ్లాక్‌ ఎంపిలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. మంగళవారం లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమైన రెండు నిమిషాలకే సభ మధ్యాహ్నానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

బీహార్‌లోని ఎస్‌ఐఆర్‌కి సంబంధించి ప్రతిపక్ష సభ్యులు పలు అంశాలను లేవనెత్తేందుకు యత్నించారు. కాంగ్రెస్‌ ఎంపి మాణికం ఠాగూర్‌ ఎస్‌ఐఆర్‌పై నోటీసు ఇచ్చారు. కానీ సభ రెండు నిమిషాల్లోనే వాయిదా పడింది. నిబంధన 267 కింద ప్రతిపక్ష సభ్యులు 12 వాయిదా నోటీసులు ఇచ్చారు. జాబితా చేయబడిన అంశంపై చర్చించడానికి ఈ రోజు సభా కార్యకలాపాలను నిలిపివేయాలని కోరింది. అయితే డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ ఈ వాయిదా నోటీసులను తిరస్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -