న్యూఢిల్లీ : భారత్, బ్రిటన్ మధ్య 24న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) జరగనుంది. లండన్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్ హాజరు కానున్నారు. ఈ ఒప్పందంపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేయనున్నారు. దీని ద్వారా 2030 నాటికి 120 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాని చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఒప్పందంలో భారత్‌కు చెందిన తోలు, ఫుట్‌వేర్, దుస్తుల ఎగుమతులపై సుంకాలను తొలగించనుంది. అదే విధంగా బ్రిటన్ నుంచి వచ్చే విస్కీ, కార్ల దిగుమతులపై భారత్ టారిఫ్‌లను ఎత్తివేయనుంది. బ్రిటిష్ పార్లమెంట్, భారత కేబినెట్ ఆమోదం తర్వాత ఏడాదిలో అమలులోకి రానుంది. ఈ ఎఫ్‌టీఏకు సంబంధించి మే 6న ఈ ఒప్పంద చర్చలు ముగిశాయి. బుధవారం నుంచి మోడీ నాలుగు రోజుల పాటు బ్రిటన్, మాల్దీవ్స్‌ల పర్యటనకు వెళ్లనున్నారు. పలు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల్లో పాల్గొననున్నారు.