నవతెలంగాణ – అశ్వారావుపేట
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశాన్ని,తెలంగాణ రాష్ట్రాన్ని మత్తు పదార్థ,మాదక ద్రవ్యం వినియోగ రహిత దేశంగా, రాష్ట్రంగా నిర్మించేందుకు కృషి చేస్తున్నాయి అని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అల్లు అనిత అన్నారు. బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నాసా ముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు,అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది చేత మాదక ద్రవ్యం,మత్తు పదార్దాల వ్యతిరేక ప్రతిజ్ఞ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనమందరం మత్తు పదార్థాల,మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించేందుకు కంకణ బద్దులు కావాలని సూచించారు. విద్యార్థులు ఎవరికైనా మత్తు పదార్థాలు వినియోగించి నా లేదా విక్రయిస్తున్న సమాచారం తెలిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏజీఎంఓ అరవింద్ బాబు,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డేగల నరసింహారావు, అధ్యాపకులు కళాశాల సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.