Wednesday, August 6, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌ మంచి భాగస్వామి కాదు

భారత్‌ మంచి భాగస్వామి కాదు

- Advertisement -

– కొన్ని గంటల్లోనే మరిన్ని సుంకాలు
– ఆగని ట్రంప్‌ బెదిరింపులు
వాషింగ్టన్‌ :
ప్రధాని నరేంద్ర మోడీ తనకు అత్యంత ఆప్త మిత్రుడు అని పదే పదే చెప్పిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై విషం గక్కడాన్ని మాత్రం ఆపడం లేదు. రానున్న 24 గంటల్లో భారత్‌పై సుంకాలను గణనీయంగా పెంచుతామని ట్రంప్‌ మంగళవారం సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. రష్యా నుంచి భారత్‌ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తోందని చెప్పారు. దీంతో ఉక్రెయిన్‌ యుద్ధానికి ఆజ్యం పోస్తోందన్నారు. వాణిజ్యం విషయంలో భారత్‌ మంచి భాగస్వామి కాదని కొత్త పాట అందుకున్నారు. ”ఇండియా మాతో పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తోంది. మేం మాత్రం ఆ స్థాయిలో చేయడం లేదు. అందుకే 25శాతం సుంకాలు విధించాం. రానున్న 24 గంటల్లో దీన్ని భారీగా పెంచబోతున్నాం. రష్యా నుంచి భారత్‌ భారీ స్థాయిలో చమురును కొనుగోలు చేస్తుంది. రష్యా యుద్ధ యంత్రానికి ఇంధనం అందిస్తుంది. వారు అలా చేస్తే నేను సంతోషంగా ఉండను.” అని ట్రంప్‌ పేర్కొన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై రష్యా సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌పై వాణిజ్యపరంగా ఒత్తిడిని పెంచుతోందని పేర్కొంది. సార్వభౌమ దేశాలకు తమ వాణిజ్య భాగస్వాములను సొంతంగా ఎంచుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -