4-0తో ఉరుగ్వేపై విజయం
ఎఫ్‌ఐహెచ్ హాకీ క్వాలిఫయర్స్
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎఫ్‌ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో ఆతిథ్య భారత్ బోణీ కొట్టింది. ఆదివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో ఉరుగ్వేపై 4-0తో భారత్ గెలుపొందింది. తొలి 15 నిమిషాల ఆటలో ఇరు జట్లు గోల్ కొట్టలేదు. రెండో క్వార్టర్‌లో (21వ నిమిషం) సునెలిట పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్‌కు 1-0 ఆధిక్యం అందించింది. మూడో క్వార్టర్‌లో ఇషికా (40వ నిమిషం) ఫీల్డ్ గోల్‌తో ఆధిక్యం 2-0కు మెరుగుపర్చింది. ఆఖరు 15 నిమిషాల ఆటలో భారత్ మరో రెండు గోల్స్ కొట్టింది. 49వ నిమిషంలో లాల్‌రెమిసియామి, 58వ నిమిషంలో రుతుజ గోల్స్ కొట్టారు. భారత్‌కు 6 పెనాల్టీ కార్నర్‌లు దక్కినా.. ఒక్క పెనాల్టీ కార్నర్‌ను మాత్రమే గోల్‌గా మలిచారు. ఉరుగ్వే రెండు పెనాల్టీ కార్నర్‌లు సాధించినా.. భారత గోల్‌కీపర్ సమర్థవంతంగా నిలువరించింది. మరో మ్యాచ్‌లో వేల్స్‌పై స్కాట్లాండ్ 1-0తో.. ఆస్ట్రియాపై దక్షణ కొరియా 1-0తో, ఇటలీపై ఇంగ్లాండ్ 5-2తో విజయాలు సాధించాయి. నేడు గ్రూప్ దశలో స్కాట్లాండ్‌తో భారత్ తలపడనుంది.
భారత్ శుభారంభం
- Advertisement -
- Advertisement -



