Thursday, February 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం40 దేశాల కోళ్లు, గుడ్లపై సౌదీ నిషేధం జాబితాలో భారత్‌

40 దేశాల కోళ్లు, గుడ్లపై సౌదీ నిషేధం జాబితాలో భారత్‌

- Advertisement -

రియాద్‌: అరబ్‌ దేశం సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. 40 దేశాల నుంచి కోళ్లు, గుడ్లు దిగుమతులపై పూర్తి నిషేధం విధించింది. ప్రజారోగ్యం, ఆహార భద్రత వంటి కారణాల దష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ వెల్లడించింది. నిషేధించిన దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆరోగ్య పరిణామాలు, అంటువ్యాధులు వంటి అంశాలను సమీక్షించి ఈ నిషేధం విధించినట్టు సౌదీ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అథారిటీ వెల్లడించింది. 40 దేశాల నుంచి పౌల్ట్రీ, గుడ్లపై సంపూర్ణ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ జాబితాలో భారత్‌తో పాటు అఫ్గానిస్థాన్‌, చైనా, జర్మనీ, ఇండోనేషియా, యూకే, జపాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ వంటి దేశాలు ఉన్నాయి. ఇక, మరో 16 దేశాల్లోని నిర్దిష్ట ప్రాంతాలపై పాక్షిక ఆంక్షలు విధించింది. ఆస్ట్రేలియా, అమెరికా, ఇటలీ, భూటాన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలపై ఈ పాక్షిక ఆంక్షలు అమలవుతాయని తెలిపింది.అయితే, ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా వేడి చేసిన పౌల్ట్రీ మాంసం, దాని సంబంధిత ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తించబోదని సౌదీ అధికారులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో బర్డ్‌ఫ్లూ, వైరస్‌ వంటి ఆందోళనల నేపథ్యంలోనే సౌదీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -