Monday, May 12, 2025
Homeఆటలుముక్కోణపు విజేత భారత్‌

ముక్కోణపు విజేత భారత్‌

- Advertisement -

ఫైనల్లో శ్రీలంకపై 97 పరుగులతో గెలుపు
కొలంబో (శ్రీలంక) :
మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌ విజేతగా టీమ్‌ ఇండియా నిలిచింది. ఆదివారం కొలంబోలో జరిగిన ఫైనల్లో ఆతిథ్య శ్రీలంకపై భారత్‌ 97 పరుగుల తేడాతో అలవోక విజయం సాధించింది. 343 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక మహిళలు 48.2 ఓవర్లలో 245 పరుగులకే అలౌటయ్యారు. భారత బౌలర్లలో స్నేహ్‌ రానా (4/38), ఆమన్జోత్‌ కౌర్‌ (3/54) శ్రీలంకను విలవిల్లాడించారు. శ్రీలంక తరఫున చమరి ఆటపట్టు (51, 66 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), నీలాక్షిక సిల్వ (48, 58 బంతుల్లో 5 ఫోర్లు) మినహా ఇతరు బ్యాటర్లు తేలిపోయారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 342 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ స్మృతీ మంధాన (116, 101 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగా.. హర్లీన్‌ డియోల్‌ (47), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (41), జెమీమా రొడ్రిగస్‌ (44), ప్రతీక రావల్‌ (30), దీప్తి శర్మ (20 నాటౌట్‌) సమిష్టిగా రాణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -