Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంస్కెంజెన్‌ వీసాల తిరస్కరణతో...రూ.136 కోట్లు నష్టపోయిన భారత్‌

స్కెంజెన్‌ వీసాల తిరస్కరణతో…రూ.136 కోట్లు నష్టపోయిన భారత్‌

- Advertisement -

న్యూఢిల్లీ: గత సంవత్సరం స్కెంజెన్‌ వీసాల తిరస్కరణ కారణంగా మన దేశం ఫీజుల రూపంలో రూ.136 కోట్లు నష్టపోయింది. 2024లో మొత్తం 1.65 లక్షల స్కెంజెన్‌ వీసాలను తిరస్కరించారు. యూరోపియన్‌ యూనియన్‌లోని 29 దేశాలలో స్వల్పకాలిక పర్యటనల కోసం అనుమతించేందుకు స్కెంజెన్‌ వీసాలు జారీ చేస్తారు. గత సంవత్సరం అల్గేరియా, టర్కీ జాతీయుల తర్వాత స్కెంజెన్‌ వీసాల తిరస్కరణ కారణంగా ఎక్కువగా నష్టపోయింది భారతీయులే. స్కెంజెన్‌ వీసా కోరుకునే వ్యక్తి దరఖాస్తు ఫీజుగా రూ.8,500 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తును ఆమోదించినా లేక తిరస్కరించిన ఫీజును వాపసు చేయరు.
గత సంవత్సరం భారతీయులు 11 లక్షలకు పైగా స్కెంజెన్‌ వీసాల కోసం దరఖాస్తు చేశారు. వీటిలో 5,91,610 దరఖాస్తులకు ఆమోదం లభించింది. కానీ 1.6 లక్షలకు పైగా తిరస్కరణకు గురయ్యాయి. అంటే తిరస్కరణల రేటు 15 శాతంగా ఉంది. భారతీయ పర్యాటకులకు ఫ్రాన్స్‌ నుండే ఎక్కువగా తిరస్కరణలు ఎదురయ్యాయి. దీని వల్ల రూ.25.8 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అల్గేరియా అత్యధికంగా రూ.153 కోట్లు నష్టపోగా టర్కీ (రూ.140.6 కోట్లు), భారత్‌ (రూ.136.6 కోట్లు), మొరాకో (రూ.95.7 కోట్లు), చైనా (రూ.66.7 కోట్లు) దేశాలు ఆ తర్వాతి స్థానాలలో నిలిచాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad