పాక్‌పై 58 పరుగులతో గెలుపు
బులావయో : సూపర్‌సిక్స్‌లో పాకిస్తాన్‌పై 58 పరుగుల తేడాతో గెలుపొందిన యువ భారత్.. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన సూపర్‌సిక్స్ గ్రూప్-బి మ్యాచ్‌లో పాక్‌పై భారత్ అలవోక విజయం సాధించింది. తొలుత భారత్ 49.5 ఓవర్లలో 252/10 పరుగులు చేసింది. వేదాంత్ మల్హోత్రా (68, 98 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), వైభవ్ సూర్యవంశీ (30), కనిష్క్ చౌహాన్ (35), అంబ్రిశ్ (29) రాణించారు. ఛేదనలో పాకిస్తాన్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో ఆయుశ్ మాత్రె (3/21), ఖిలాన్ పటేల్ (3/35) మూడు వికెట్ల ప్రదర్శనతో మెరిశారు. మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌తో ఆస్ట్రేలియా తలపడనుండగా.. బుధవారం రెండో సెమీస్‌లో అఫ్గనిస్తాన్‌తో భారత్ ఢకొీట్టనుంది.
సెమీస్‌కు భారత్
- Advertisement -
- Advertisement -



