– అమెరికా సలహాదారు హెచ్చరిక
వాషింగ్టన్ : రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా తన హెచ్చరికలను కొనసాగిస్తోంది. మాస్కో నుంచి ఇండియా ముడి చమురు కొనుగోళ్లను ఆపాలని అమెరికా సలహాదారు నవారో అన్నారు. ఉక్రెయిన్‌తో మాస్కో యుద్ధానికి భారత చమురు నిధులు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయని.. వీటిని తక్షణం ఆపాలని వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో పేర్కొన్నారు. న్యూ ఢిల్లీ ఇప్పుడు రష్యా, చైనాతో సన్నిహితంగా ఉంటోందని పేర్కొన్నారు. అమెరికా వ్యూహాత్మక భాగస్వామిగా భారత్ పరిగణించబడాలనుకుంటే.. రష్యా, చైనాలతో వ్యాపార సంబంధాలను తగ్గించుకోవాలని పరోక్షంగా పేర్కొన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకే తమకు లక్ష్యంగా మారిందన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తున్నందుకు భారతీయ వస్తువులపై అదనంగా 25 శాతం టారిఫ్‌లను విధిస్తూ ఇటీవల అమెరికా అధ్యక్షడు ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో భారత్‌పై సుంకాల మొత్తం 50 శాతానికి చేరుతుంది. ”రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడం ద్వారా మాస్కోకు అవసరమైన డాలర్లను అందిస్తోంది. రష్యా, చైనాతో భారత్ సన్నిహిత సంబంధాలు నెరవేర్చితే అమెరికాకు చెందిన అత్యాధునిక సైనిక సామర్థ్యాలను ఇండియాకు బదిలీ చేయడం ప్రమాదకరమని భావిస్తున్నాము.” అని నవారో పేర్కొన్నారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES