Thursday, April 2, 2026
E-PAPER
Homeఆటలుజులైలో జింబాబ్వేపర్యటనకు భారత్‌

జులైలో జింబాబ్వేపర్యటనకు భారత్‌

- Advertisement -

హరారే : భారత పురుషుల క్రికెట్‌జట్టు జులైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్‌-జింబాబ్వే జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ జరగనున్నట్లు హరారే క్రికెట్‌ క్లబ్‌ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మూడు టి20లు కూడా హరారేలోనే జరగనున్నట్లు, జులై 23నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌ నాలుగురోజులపాటు కొనసాగనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ఇక భారతజట్టు చివరిసారిగా 2024లో జింబాబ్వే పర్యటనకు వెళ్లి ఐదు టి20ల సిరీస్‌లో తలపడింది. ఈ ఏడాది భారతజట్టు బిజీ షెడ్యూల్‌ను గడపనున్న దృష్ట్యా స్వల్పకాలిక ద్వైపాక్షిక సిరీస్‌కు భారతజట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే ఛాన్స్‌ ఉంది. ఆ తర్వాత 2027లో జింబాబ్వే జట్టు భారత పర్యటనకు రానుంది. ఆ పర్యటనలో భాగంగా జింబాబ్వేతో భారతజట్టు మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఈ వన్డే సిరీస్‌కోసం కోల్‌కతా, హైదరాబాద్‌, ముంబయి వేదికలను బిసిసిఐ ఇప్పటికే ఖరారు చేసింది.

షెడ్యూల్‌…
జులై 23(గురు) : తొలి టి20(హరారే)
జులై 25(శని) : రెండో టి20(హరారే)
జులై 26(ఆది) : మూడో టి20(హరారే)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -